KCR: కేసీఆర్‌ సంచలన నిర్ణయం.. విచారణకు హాజరు

KCR: కేసీఆర్‌ సంచలన నిర్ణయం.. విచారణకు హాజరు
X
కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయం

బీఆర్‌ఎస్‌ చీఫ్ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. జూన్ ఐదో తేదీన విచారణకు హాజరుకావాలని కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. హాజరు కాకపోతే అక్కడేదో తప్పు జరిగిపోయిందని..దానికి కేసీఆరే బాధ్యుడని అందుకే తప్పించుకుంటున్నారన్న ప్రచారం జరుగుతుంది. అందుకే కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. ఐదో తేదీన రావాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ కూడా నోటీసులు జారీ చేసింది.తాను హాజరవుతానని ఈటల రాజేందర్ ప్రకటించారు. కేసీఆర్ హాజరవుతున్నందున.. హరీష్ రావు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ విచారణకు హాజరు కారని.. కావాలంటే ప్రశ్నలు పంపిస్తే సమాధానాలివ్వడమో లేకపోతే కోర్టుకు వెళ్లడమో చేస్తారని అనుకున్నారు. కానీ న్యాయనిపుణులతో సంప్రందించిన తర్వాత హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే కాళేశ్వరంకు పని చేసిన పలువురు అధికారులు తాము కేసీఆర్ చేప్పిందే చేశామని వాంగ్మూలం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. సీఎంగా ఉన్న కేసీఆర్​ కొంత కాలం ఇరిగేషన్ శాఖను కూడా చూసుకున్నారు. తర్వాత కొంతకాలం ఇరిగేషన్, ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్​రావు, కొంతకాలం ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్​ పని చేశారు.

Tags

Next Story