KCR: వందశాతం అధికారం మాదే: కేసీఆర్

KCR: వందశాతం అధికారం మాదే: కేసీఆర్
X
బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ ధీమా... తెలంగాణను కాపాడేది తామే అన్న గులాబీ దళపతి

బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము 100 శాతం విజయం సాధిస్తామని వెల్లడించారు. పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న కేసీఆర్... తమ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. గులాబీ పార్టీ మాత్రమే తెలంగాణను కాపాడగలదని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. పార్టీ కమిటీలు వేయాలని నిర్దేశించిన ఆయన.. ఈ కమిటీల ఏర్పాటుకు ఇన్‌ఛార్జ్‌గా హరీశ్ రావును నియమించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టంగా మార్చాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.

ఒర్లకండిరా బాబు: కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన.. ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. అయితే కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నప్పుడు అక్కడున్న కార్యకర్తలు "సీఎం సీఎం" అంటూ నినాదాలు చేశారు. దీంతో కేసీఆర్ తన పాత స్టైల్లో "ఒర్లకండిరా బాబు" అని అన్నారు. కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చినప్పుడు అక్కడ కాస్త తోపులాట కూడా జరిగింది. కేసీఆర్ మాటతో అందరూ సైలెంట్ అయిపోయారు.

ఓటమితో ఆగిపోతామా..?

శాసనసభ ఎన్నికల్లో ఓటమిపై కేసీఆర్ స్పందించారు. ఒక్క ఓటమితో తమ పార్టీ ఆగిపోతుందా అని ప్రశ్నించారు. ఒక్క ఓటమి.. బీఆర్ఎస్ ను ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఆటుపోట్లను ఎన్నో ఎదుర్కొని గులాబీ జెండా నిలబడిందని గుర్తు చేశారు. ఏప్రిల్ 10 నుంచి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేపడతామని.. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెస్తామని వెల్లడించారు. అధికారం అనుభవించాక.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు నేతలు భ్రమల్లో ఉన్నారని.. ఆ భ్రమలను వీడి బయటకు రావాలని స్పష్టం చేశారు. పది మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో బయటకు వెళ్లారని గుర్తు చేశారు.

Tags

Next Story