KCR: సీఎం కేసీఆర్‌తో ముగిసిన 26 రాష్ట్రాల రైతు ప్రతినిధుల సమావేశం..

KCR: జాతీయ రైతుసంఘాల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ రెండ్రోజుల సమావేశం ముగిసింది. ప్రగతిభవన్‌లో వివిధ రాష్ట్రాల రైతు ప్రతినిధులు, జాతీయ రైతుసంఘాల నాయకులతో సుధీర్ఘంగా చర్చించారు సీఎం కేసీఆర్. ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించడమే రైతు సమస్యలకు పరిష్కారమన్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణ సాధన కోసం అనుసరించిన జమిలి పంథాతో.. గమ్యాన్ని చేరుకోగలమన్నారు. రైతు వ్యతిరేకులతో జై కిసాన్ నినాదాన్ని పలికించాలన్నారు. రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం అని, రైతు బాగుంటెనే వ్యవసాయం బాగుంటుందని.. రైతు మర్యాదను నిలబెట్టి, ఆత్మ గౌరవం కాపాడేందుకు కలిసి పనిచేద్దామని జాతీయ రైతు నేతలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.
దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ మీటింగ్‌లో కిసాన్ ఆందోళనలో పాల్గొన్న పలువురు సీనియర్ రైతు సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. 26 రాష్ట్రాల రైతు ప్రతినిధుల భాగస్వామ్యంతో ఇంత సుదీర్ఘంగా సమావేశం జరగడం దేశంలో ఇదే మొదటిసారి అని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com