KCR Shankersingh Vaghela : గుజరాత్ మాజీ సీఎంతో కేసీఆర్ భేటి..

KCR Shankersingh Vaghela : గుజరాత్ మాజీ సీఎంతో కేసీఆర్ భేటి..
X
KCR Shankersingh Vaghela : గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌ సింఘ్‌వాఘేలాతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్

KCR Shankarsingh Vaghela : గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌ సింఘ్‌వాఘేలాతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. ప్రగతిభవన్‌లో ఈ భేటీ జరిగింది. ఇరువురు నేతలు దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై చాలా సేపు చర్చించారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు కలిసి పెనుమార్పు తీసుకురావాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీ వైఫల్యాలు, మతతత్వ రాజకీయాలు అనే అంశాలను దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విషయం గురించి ఇరువురు చర్చించారు.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సీఎం కేసీఆర్‌ పక్కాగా వ్యూహం రచిస్తున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నేతలను హైదరాబాద్‌కు రమ్మని ఆహ్వానిస్తున్నారు.

Tags

Next Story