KCR : 9 ఏళ్ల పాపకు సీఎం కేసీఆర్ నామకరణం..

KCR : 9ఏళ్ల పాపకు సీఎం కేసీఆర్ నామకరణం చేసి ఆ తల్లిదండ్రుల కల నెరవేర్చారు. మొత్తానికి 9ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పనిచేసిన భూపాలపల్లి జిల్లా నందిగామ గ్రామానికి చెందిన సురేష్-అనిత దంపతులకు 2013లో ఆడపిల్ల జన్మించింది. తమ బిడ్డకు నాటి ఉద్యమసారథి కేసీఆర్ నామకరణం చేయాలని భావించారు. అంతలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడంతో ఆ దంపతులు కలవలేకపోయారు.
ఐనా ఆ దంపతులు తమ కలను చంపుకోలేదు. తమ బిడ్డకు పేరు పెట్టకుండానే 9 ఏళ్లుగా పెంచుకుంటూ వచ్చారు. విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆ తల్లిదండ్రులను, బిడ్డను ప్రగతి భవన్‌కు తీసుకువెళ్లి సీఎంను కల్పించారు. సురేష్-అనిత దంపతులను సీఎం కేసీఆర్ దంపతులు ఆశీర్వదించి 9ఏళ్లకు పాపకు మహతి అని నామాకరణం చేశారు. తమ ఇంటికి వచ్చినవారికి సీఎం దంపతులు బట్టలు పెట్టి సాంప్రదాయ పద్ధతిలో ఆథిత్యమిచ్చారు. బిడ్డ చదువు కోసం ఆర్థిక సాయం అందించారు. తమ కల నెరవేరినందుకు సురేష్-అనిత దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com