KCR Press Meet: టచ్ చేసి చూడు.. దమ్ముందా..? బండి సంజయ్‌కు కేసీఆర్ వార్నింగ్..

KCR Press Meet (tv5news.in)
KCR Press Meet: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. రాజకీయ పబ్బం గడుపుకోవడమే చిల్లర మాట్లాడుతున్నారని విమర్శించారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం మెడలు సంజయ్ వంచుతడా అని ప్రశ్నించారు. కేసీఆర్ ను అరెస్టు చేయించి బతికి బట్ట కడతరా అన్నారు. మెడలు వంచడం కాదు మెడలు ఇరుస్తామంటూ హెచ్చరించారు.
పెట్రోల్ డీజిల్ ధరలపై అద్భుతమైన రీతిలో కేంద్రం అబద్ధం చెప్పిందన్నారు సీఎం కేసీఆర్. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ ధర 75 రూపాయలు ఉంటే ఇవాళ 120 రూపాయలకు తెచ్చిందన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయనడం అబద్ధమన్నారు. సుంకంను సెస్ రూపంలోకి మార్చి రాష్ట్రాలకు ట్యాక్స్ ఎగ్గొట్టారని ఆరోపించారు. ఏడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పైసా కూడా పెంచలేదన్నారు. అలాంటప్పుడు రాష్ట్రం పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించాలనడం ఏం నైతికత అని ప్రశ్నించారు. కేంద్రం వంద శాతం సెస్ తగ్గించాలన్నారు. అప్పుడు పెట్రోల్ 75 రూపాయలకే వస్తుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com