ముఖ్యమంత్రి పదవి ప్రజలు పెట్టిన బిక్ష: కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి ప్రజలు పెట్టిన బిక్ష:  కేసీఆర్
X
తనకి జానారెడ్డి సీఎం పదవిని బిక్షగా పెట్టారని కొందరు చెబుతున్నారని, సీఎం పదవి వస్తే ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవాడని చెప్పారు.

తనకి ముఖ్యమంత్రి పదవి ప్రజలు పెట్టిన బిక్ష అని హాలియా సభలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తనకి జానారెడ్డి సీఎం పదవిని బిక్షగా పెట్టారని కొందరు చెబుతున్నారని, సీఎం పదవి వస్తే ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవాడని.. తనకి ముఖ్యమంత్రి పదవి ప్రజలు పెట్టిన బిక్ష అని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు సక్కగుంటే టీఆర్ఎస్ జెండా ఎందుకు ఎగిరిందని ప్రశ్నించారు.

పదవుల కోసం కాంగ్రెస్ తెలంగాణను పక్కన పెడితే.. తెలంగాణ కోసం టీఆర్ఎస్ పదవులను పక్కన పెట్టిందని అన్నారు. 60 ఏళ్ళు పాలించి తెలంగాణను ఆగం చేశారని సీఎం ఆరోపించారు. ఇక 30 ఏళ్ల జానారెడ్డి రాజకీయ చరిత్రలో హాలియాకి ఓ డిగ్రీ కాలేజీకి కూడా దిక్కు లేదని అన్నారు. నేను చెప్పిందే వేదం కాదని, వాస్తవాలన్ని కళ్ళముందు ఉన్నాయని.. విచక్షణతో ఓటేయాలని ప్రజలను కోరారు కేసీఆర్.

Next Story