KCR: 8 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ శుద్ధ దండగ: కేసీఆర్‌

KCR: 8 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ శుద్ధ దండగ: కేసీఆర్‌
KCR: ఢిల్లీలో రేపు జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

KCR: ఢిల్లీలో రేపు జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపేందుకు ఇది ఉత్తమమైన మార్గంగా భావించి.. ప్రధాని మోదీకి నిరసనను బహిరంగ లేఖ ద్వారా తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎంతో సదుద్దేశంతో ప్లానింగ్‌ కమీషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు చేస్తే.. దాన్ని స్థానంలో నిరర్ధకమైన నీతి ఆయోగ్‌ను మోదీ తీసుకువచ్చారని మండిపడ్డారు.

మోదీ వాగ్దానాలు, నీతిఆయోగ్ సృష్టి ఒక జోక్ అయిపోయిందని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. విద్వేషం, అసహనం పెరిగిపోయి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని, ఏ ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదని రైతుల ఆదాయం డబుల్ కాలేదుకానీ, పెట్టుబడి రెట్టింపు అయిందన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ప్రాజెక్టులు అద్భుతమని కేంద్రమంత్రలు, నీతి ఆయోగ్‌ కితాబిచ్చిందన్నారు కేసీఆర్‌. వారే స్వయంగా పరిశీలించి వీటికి 24 వేల కోట్ల రుపాయలు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేస్తే.. ఇప్పటికీ 24 పైసలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

నీతి ఆయోగ్‌ సిఫార్సులే బుట్టదాఖలవుతో ఇంకా ఆ సంస్థ ఉన్నా, లేకున్నా ఒకటేనన్నారు. ఎన్పీయేలు ఎన్డీయే ప్రభుత్వంలో ఓ దందాగా మారిందని.. ప్రభుత్త పెద్దలు, ఎప్పీయే వాళ్లు చేతులు కలిపి పెద్ద స్కాం చేస్తున్నారని కేసీఆర్‌ ఆరోపించారు. 2014 నాటికి 2 లక్షల 23 వేల కోట్ల రుపాయలు ఉంటే, ఈ ఎనిమిదేళ్లలో అది కాస్తా 20 లక్షల ఏడు వేల కోట్లకు చేరినట్లు కేసీఆర్‌ తెలిపారు. వాళ్లు ఎన్పీయే డిక్లేర్ చెయ్యగానే.. ప్రభుత్వం నుంచి భారీగా నిధులు మంజూరు చేస్తూ భారీ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story