KCR Delhi Tour: ఢిల్లీ బాటపట్టిన కేసీఆర్.. పలువురు పెద్దలతో భేటీకి ప్లాన్..
KCR Delhi Tour: దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ బాట పట్టారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లిన కేసీఆర్.. అక్కడే రెండు, మూడు రోజులు సీఎం మకాం వేయనున్నట్లు సమాచారం. మొదటగా ఇవాళ కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వంగా కలిసి అభినందనలు తెలపనున్నారు.. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రలతో సమావేశం కానునట్లు తెలుస్తోంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో వరదల వల్ల కలిగిన నష్టాన్ని కేసీఆర్ వివరించనున్నారు. ఇక కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా కలిసి రాష్ట్రంలో వరదలు సృష్టించిన బీభత్సం గురించి వివరించబోతున్నారు తెలుస్తోంది. దీనితో పాటు కేంద్రం విడుదల చేయాల్సిన పెండింగు నిధుల పై కూడా చర్చించనున్నట్లు సమాచారం.
ఇరువురు కేంద్ర మంత్రుల తో జరిగే భేటీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పలువురు టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణలో ఇప్పటికే కేంద్ర బృందాలు పర్యటించారు.. వరద వల్ల ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేశాయి.. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ నష్టం కలిగింది.
కాగా రెండు మూడ్రోజుల పాటు హస్తినలోనే మకాం వేయనున్నారు కేసీఆర్.. తన పర్యటనలో విపక్షాలకు చెందిన జాతీయ నేతలను కలవనున్నారు.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ఢిల్లీలోనే ఉన్నారు.. ఆమె కూడా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో.. కేసీఆర్ హస్తిన టూర్ ఆసక్తికరంగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com