ఫామ్‌హౌస్‌లో పడిపోయిన కేసీఆర్.. యశోదలో చికిత్స

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు గురు, శుక్రవారాల్లో రాత్రి ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పడిపోవడంతో తుంటి ఫ్రాక్చర్‌కు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు.
అర్ధరాత్రి సమయంలో చంద్రశేఖర్‌రావు బాత్‌రూమ్‌కు వెళ్లేసరికి కిందపడిపోయినట్లు సమాచారం. చికిత్స నిమిత్తం సోమాజిగూడలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతని ఎడమ తుంటి ఎముకకు ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. శస్త్రచికిత్స అవసరం కావచ్చని అన్నారు. తదుపరి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, వచ్చిన రిపోర్టుల ఆధారంగా వైద్యులు ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మాజీ ముఖ్యమంత్రి ఆదివారం రాత్రి ప్రగతి భవన్ (ప్రస్తుతం జ్యోతిబా ఫూలే ప్రజాపాలన భవన్)లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం నుండి బయలుదేరినప్పటి నుండి తన ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. గత నాలుగు రోజులుగా ఫామ్‌హౌస్‌లో పార్టీ కార్యకర్తలు, తనను కలిసేందుకు వస్తున్న ప్రజలను కలుస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com