KCR National Party: హైదరాబాద్ వేదికగా కొత్త జాతీయ పార్టీ.. స్పీడ్ పెంచిన సీఎం కేసీఆర్

KCR National Party: హైదరాబాద్ వేదికగా కొత్త జాతీయ పార్టీ.. స్పీడ్ పెంచిన సీఎం కేసీఆర్
X
KCR National Party: జాతీయ రాజకీయాలపై స్పీడ్ పెంచిన సీఎం కేసీఆర్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. త్వరలో హైదరాబాద్ వేదికగా కొత్త జాతీయ పార్టీని ప్రకటించనున్నారు.

KCR National Party: జాతీయ రాజకీయాలపై స్పీడ్ పెంచిన సీఎం కేసీఆర్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. త్వరలో హైదరాబాద్ వేదికగా కొత్త జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఈ కీలక సమావేశానికి బీజేపీని వ్యతిరేకించే అన్ని ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించనున్నారు కేసీఆర్. మొదట జెండా.. ఎజెండా మాత్రమే ఖరారు చేయనున్నారు. జాతీయ పార్టీ ప్రకటన తర్వాతే ప్రాంతీయ పార్టీలతో పొత్తులు ఉండేలా పావులు కదుపుతున్నారు.

మరోవైపు ఇవాళ తెలంగాణభవన్‌లో అన్ని జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో జాతీయ పార్టీపై టీఆర్ఎస్ శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా ముఖ్యమంత్రులను, మాజీ సీఎంలను కలిసిన సీఎం కేసీఆర్.. త్వరలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ పర్యటించనున్నారు.

Tags

Next Story