సిద్దిపేట పర్యటనలో సీఎం కేసీఆర్‌..రూ.850 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

సిద్దిపేట పర్యటనలో సీఎం కేసీఆర్‌..రూ.850 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
X

సిద్దిపేట పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌.. నర్సాపూర్‌లో డబుల్‌ బెడ్ రూమ్‌ ఇళ్లను ప్రారంభించారు. వాటిని లబ్దిదారులకు అందించారు. 35 ఎకరాల్లో 163 కోట్లతో 205 బ్లాక్‌లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు. ఒక్కో బ్లాక్‌కు 12 ఇండ్ల చొప్పున మొత్తం 2 వేల 460 ఇళ్లు సిద్ధమయ్యాయి. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో G+2 విధానంలో నిర్మాణం చేపట్టారు. ఈ రోజు సీఎం KCR సమక్షంలో 144 మంది గృహప్రవేశాలు జరుగుతున్నాయి. మిగతా 11 వందల 97 మంది లబ్ధిదారులు దశలవారీగా కొత్త ఇళ్లలోకి వస్తారు. చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్న మిగతా 1000 ఇళ్లు 2 వారాల్లోనే పూర్తిచేసి లబ్దిదారులకు అందించనున్నారు.

అర్హులకే ఇళ్లు అందేలా చూసేందుకు జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి నేతృత్వంలో పూర్తి పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక జరిగింది. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన తర్వాత క్షేత్రస్థాయిలో వివిధ స్క్రూటినీలు చేశారు. తర్వాత లాటరీ విధానంలో ఫ్లాట్లు కేటాయించారు. తొలి విడతలో 1 వెయ్యి 341 డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు పూర్తయ్యాయి. మిగత వాటిలో విద్యుత్, వాటర్‌తోపాటు గ్యాస్‌ సరఫరాకి కూడా పైప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. ఇవాళ గృహప్రవేశాల సందర్భంగా ఇంటి పట్టాతో పాటు కరెంట్ మీటర్ నంబర్, వాటర్ కనెక్షన్ మార్పిడి పత్రం, ప్రాపర్టీ టాక్స్, కామన్ అఫిడవిట్, వంట గ్యాస్ సంబంధిత పత్రాలను అందించనున్నారు. CM కేసీఆర్, మంత్రి హరీష్ వల్లే తమ సొంత ఇంటికల నిజం అవుతోందని పేదలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నర్సాపూర్ 2 BHK గేటెడ్ కమ్యూనిటీ ప్రత్యేకతలను ఒక్కసారి పరిశీలిస్తే.. ఆనందం, ఆహ్లదం, భద్రత, అధునాతన సౌకర్యాలకు ఈ గృహ సముదాయంలో పెద్ద పీట వేశారు. 247 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నారు. పేదల ఇళ్లకు గ్యాస్‌ సరఫరా చేయడం దేశంలోనే ఇక్కడే తొలిసారి అని చెప్పుకోవచ్చు. అలాగే 24 గంటలు నీటి సరఫరా, గృహ విద్యుత్ సరఫరా, అన్ని ఇండ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రెండు పెద్ద కమ్యూనిటీ హాల్ లు, సమీకృత మార్కెట్ కాంప్లెక్స్, పోలీస్ ఔట్ పోస్ట్, షాపింగ్ కాంప్లెక్స్, బస్తీ దవాఖానా, పిల్లల ప్లే ఏరియా తో కలుపుకుని 4 పార్క్ లు, విశాలమైన రోడ్లు, LED వీధి దీపాలు, ప్రత్యేక సివరేజి ట్రీట్ మెంట్ ప్లాంట్, అండర్ గ్రౌండ్ సంపు, పవర్ బోర్ వేల్, ప్రత్యామ్నాయ త్రాగునీటి సరఫరా, ఇంకుడు గుంతలు ఇలా అన్నీ ఏర్పాటు చేశారు.

నర్సాపూర్‌లో పర్యటన తర్వాత సీఎం కేసీఆర్‌.. రంగనాయకసాగర్‌ గెస్ట్‌ హోజ్‌ను ప్రారంభించారు. రంగనాయక సాగర్‌ గుట్ట మధ్యలో గెస్ట్‌హౌజ్‌ను నిర్మించారు. గెస్ట్‌హౌజ్‌ ప్రారంభోత్సవం తర్వాత.. అందులోని వసతుల్ని కేసీఆర్‌ పరిశీలించారు.

Tags

Next Story