KCR Vs Revanth: కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ
కేసీఆర్ సర్కార్ అసమర్ధ పాలనతో అప్పుల భారం, ఆర్థిక సంక్షోభం

కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఏసీడీ పేరుతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపుతుందన్నారు. అలాగే పోలీస్ లైసెన్స్ పేరుతో వ్యాపారులపై భారం మోపడాన్ని రేవంత్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుధవారం బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ సర్కార్ అసమర్ధ పాలనతో అప్పుల భారం, ఆర్థిక సంక్షోభం, తప్ప తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే విద్యుత్ ఏసీడీ ఛార్జీల పేరుతో ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని రేవంత్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.
Next Story