KCR: అరెస్ట్ చేస్తారు.. అయినా భయపడొద్దు

KCR: అరెస్ట్ చేస్తారు.. అయినా భయపడొద్దు
X
కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. కాళేశ్వరం నివేదికతో ఎలాంటి ఇబ్బంది లేదు

కా­ళే­శ్వ­రం కమి­ష­న్ ని­వే­దిక బహి­ర్గ­త­మైన వేళ మాజీ ము­ఖ్య­మం­త్రి, బీ­ఆ­ర్ఎ­స్ అధి­నేత కే­సీ­ఆ­ర్ కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. కొం­త­మం­ది బీ­ఆ­ర్‌­ఎ­స్ నే­త­ల­ను అరె­స్ట్ చేసే అవ­కా­శం ఉం­ద­ని.. అయి­నా ఎవరూ భయ­ప­డ­వ­ద్ద­ని నే­త­ల­కు దిశా ని­ర్దే­శం చే­శా­రు. కా­ళే­శ్వ­రం కమి­ష­న్ ని­వే­దిక రా­జ­కీయ పన్నా­గం తప్ప మరేం కా­ద­ని కే­సీ­ఆ­ర్ తె­లి­పా­రు. కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు­ను పని­కి­రా­ద­ని చె­ప్పే­వా­రు అజ్ఞా­ను­ల­ని తీ­వ్ర వి­మ­ర్శ­లు చే­శా­రు. సి­ద్ధి­పేట జి­ల్లా­లో­ని ఎర్ర­వ­ల్లి ఫామ్ హౌ­స్‌­లో కే­సీ­ఆ­ర్ కీలక సమా­వే­శం ని­ర్వ­హిం­చా­రు. కా­ళే­శ్వ­రం లి­ఫ్ట్ ఇరి­గే­ష­న్ ప్రా­జె­క్టు­పై కమి­ష­న్ ని­వే­దిక బయ­ట­కు వచ్చిన నే­ప­థ్యం­లో ఈ సమా­వే­శం ప్రా­ధా­న్యత సం­త­రిం­చు­కుం­ది. దా­దా­పు ఎని­మి­ది గం­ట­ల­పా­టు సా­గిన ఈ భే­టీ­లో హరీ­ష్ రావు, కే­టీ­ఆ­ర్, జగ­దీ­ష్ రె­డ్డి, ని­రం­జ­న్ రె­డ్డి, ప్ర­శాం­త్ రె­డ్డి వంటి పా­ర్టీ ము­ఖ్య నా­య­కు­లు పా­ల్గొ­న్నా­రు. కా­ళే­శ్వ­రం అం­శం­పై పా­ర్టీ తర­ఫున తీ­సు­కో­వా­ల్సిన భవి­ష్య­త్ చర్య­ల­పై చర్చిం­చా­రు. సమా­వే­శం­లో కే­సీ­ఆ­ర్ కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. “ఇది కా­ళే­శ్వ­రం కమి­ష­న్ కాదు, కాం­గ్రె­స్ కమి­ష­న్” అని వ్యా­ఖ్యా­నిం­చా­రు. కమి­ష­న్ ని­వే­దిక ఊహిం­చి­న­ట్లు­గా­నే వచ్చిం­ద­ని, దా­ని­పై ఎవరూ ఆం­దో­ళన చెం­దా­ల్సిన అవ­స­రం లే­ద­ని ఆయన స్ప­ష్టం చే­శా­రు. కాం­గ్రె­స్ నేతల రా­జ­కీ­యా­న్ని.. రా­జ­కీ­యం­గా­నే తి­ప్పి­కొ­డ­దా­మ­ని.. ఈ పో­రా­టం­లో పా­ర్టీ అం­డ­గా ఉం­టుం­ద­ని కే­సీ­ఆ­ర్ భరో­సా ఇచ్చా­రు.

దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం

కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు­పై జరు­గు­తు­న్న దు­ష్ప్ర­చా­రా­న్ని పా­ర్టీ­గా బలం­గా తి­ప్పి­కొ­ట్టా­ల్సిన అవ­స­రా­న్ని ఆయన నొ­క్కి చె­ప్పా­రు. ప్రా­జె­క్ట్ ద్వా­రా తె­లం­గా­ణ­కు కలి­గిన ప్ర­యో­జ­నా­ల­ను ప్ర­జ­ల­కు వి­పు­లం­గా వి­వ­రిం­చా­ల­ని... పా­ర్టీ నే­త­ల­కు కే­సీ­ఆ­ర్ సూ­చిం­చా­రు. కే­బి­నె­ట్ సమా­వే­శం­లో కా­ళే­శ్వ­రం పై ప్ర­భు­త్వం తీ­సు­కు­నే ని­ర్ణ­యా­న్ని చూసి తగిన వ్యూ­హం సి­ద్ధం చే­స్తా­మ­ని కే­సీ­ఆ­ర్ ప్ర­క­టిం­చా­రు. మరో­వై­పు టీ­ఆ­ర్‌­ఎ­స్‌­గా అవి­ర్భ­విం­చి గత 25 ఏళ్లు­గా బీ­ఆ­ర్‌­ఎ­స్‌ సా­గి­స్తు­న్న ప్ర­స్థా­నం, ఉద్యమ నా­య­కు­డి­గా, ప్ర­భు­త్వా­ధి­నే­త­గా కే­సీ­ఆ­ర్‌ చే­సిన కృ­షి­ని వి­వ­రిం­చా­ల­ని భా­వి­స్తోం­ది. ఈ నెల 26న హై­ద­రా­బా­ద్‌­లో బీ­ఆ­ర్‌­ఎ­స్‌ వి­ద్యా­ర్థి వి­భా­గం ఆధ్వ­ర్యం­లో ని­ర్వ­హిం­చే వి­స్తృత స్థా­యి సమా­వే­శం తర­హా­లో అన్ని జి­ల్లా కేం­ద్రా­ల్లో­నూ సద­స్సు­లు ని­ర్వ­హిం­చా­ల­ని బీ­ఆ­ర్‌­ఎ­స్‌ ని­ర్ణ­యిం­చిం­ది.

Tags

Next Story