సీఎం కేసీఆర్ ను కలిసిన ఢిల్లీ, పంజాబ్ సీఎంలు

సీఎం కేసీఆర్ ను కలిసిన ఢిల్లీ, పంజాబ్ సీఎంలు
X

రాష్ట్రానికి విచ్చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ లు సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ ను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి, పూల బొకేను అందించారు. కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ బృందానికి మధ్యాహ్నా భోజన ఆతిథ్యాన్ని అందించారు సీఎం కేసీఆర్. లంచ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ జన హితలో ముగ్గురు ముఖ్యమంత్రుల జాయింట్ ప్రెస్ మీట్ ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags

Next Story