Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి..

Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి..
X
Khairatabad Ganesh : మహాగణపతి శోభయాత్రతో ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి

Khairatabad Ganesh : గ్రేటర్ హైదరాబాద్‌లోని మిగతా వినాయక విగ్రహాల నిమజ్జనం ఒక ఎత్తు...! ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మరో ఎత్తు! ఈ భారీ లంబోదరుడిని క్షేమంగా గంగమ్మ ఒడికి చేర్చితే సగం నిమజ్జనం అయిపోయినట్లేనని భావిస్తారు. అందుకే ముందుగా ఈ ఏకదంతుడినే కదిలించారు. మధ్యాహ్నం 12 గంటలకు మండపం నుంచి మొదలైన ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర వైభవంగా సాగింది.

ఈసారి శ్రీ మహాలక్ష్మీ పంచముఖ గణపతిని నిలిపారు. 60 ఏళ్ల చరిత్రలో 50 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహాగణేశుడికి కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి విగ్రహాలను ఏర్పాటు చేశారు. శోభాయాత్ర కోసం మూడు ప్రత్యేక ట్రక్కును ఏర్పాటు చేసి ఊరేగించారు. ఈ శోభాయాత్ర వేలాది మంది భక్తుల మధ్య అట్టహాసంగా జరిగింది.

మహాగణపతి శోభయాత్రతో ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. లంబోదరుడికి వీడ్కోలు చెప్పేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జై బోలో గణేశ్ మహారాజ్ కీ జై నినాదాలతో హుస్సేన్ సాగర్ తీరమంతా మార్మోగింది.

డీజే సౌండ్స్‌.. డబ్బుల వాయిద్యాలు.. మహిళలు, చిన్నారులు, యువత కేరింతలు, ప్రత్యేక నృత్యాల మధ్య.. ఎన్టీఆర్ మార్గ్ లో సందడి వాతావరణం కనిపించింది.

ఏడు గంటల పాటు సాగింది మహాగణపతి శోభాయాత్ర. ఎన్టీఆర్‌ మార్గ్‌ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ నంబర్- 4 వద్దకు చేరుకున్న గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజల తర్వాత స్వామి వారి కలశాన్ని ఉత్సవ సమితి సభ్యులు నిమజ్జనం చేశారు. నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక క్రేన్ ఏర్పాటు చేశారు. గతంలో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో విగ్రహం చేయడంతో నిమజ్జనం సమయంలో తేలుతూ కనిపించేంది. అయితే ఈసారి మట్టి విగ్రహం కావడంతో నిమజ్జనం చేయగానే వెంటనే కరిగిపోయింది.

గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా పూర్తిచేసేందుకు....హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సాగర్‌లో ప్రత్యేక బోట్లు ఏర్పాటు చేశారు.

Tags

Next Story