Khairatabad Ganesh : 68 ఏళ్ల ఖైరతాబాద్ గణేష్ చరిత్రలో మొదటిసారి..

Khairatabad Ganesh : వినాయక చవితి వేడుకల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచే ఖైరతాబాద్ గణేషుడు.... పూజలు అందుకునేందుకు సిద్దం అయ్యాడు. 1954లో ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేషుడు.... ప్రతి ఏటా ఒక్కో అడుగు పెంచుకుంటూ వస్తున్నారు. 2014లో 60 అడుగుల ఎత్తుతో షష్టి పూర్తి మహాత్సవం కూడా ఘనంగా జరుపుకున్న భారీ గణేషుడు... ఆ తర్వాత నుంచి ఒక్కో అడుగు తగ్గుతున్నాడు.
ఈ సంవత్సరం 50 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శమివ్వనున్నాడు ఖైరతాబాద్ గణేషుడు. జనాలకు లక్ష్మీ కటాక్షం కలగాలని శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేష్‌ను ఏర్పాటు చేశారు. అంతే కాదు కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువు దీరారు.
68 ఏళ్ళ ఖైరతాబాద్ గణేష్ చరిత్రలో మొట్ట మొదటి సారి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 150 మంది కళాకారులు జూన్ 10 నుంచి 80 రోజుల పాటు పగలూ రాత్రి పని చేసి ఖైరతాబాద్ గణేష్‌ను రూపుదిద్దారు. దీనికి కోటిన్నర వ్యయం అయ్యింది.
హైట్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చిన ఖైరతాబాద్ గణేషుడు.... కొన్నాళ్ళు లడ్డూ నైవెద్యంలో కూడా అందరి దృష్టిని ఆకర్శించాడు. అయితే లడ్డూ పంపిణిలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో..... ఆ ఆచారాన్ని నిలిపివేశారు. ఖైరతాబాద్ గణేష్ చేతి లో కేవలం బొమ్మ లడ్డు మాత్రమే ఉంటుంది. ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆద్వర్యంలో 55 అడుగుల జంజం, 50 అడుగుల కండువా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ఖైరతాబాద్ గణేశుడి చూసేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు.. నలుమూలల బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ చౌరస్తా, ఐమాక్స్ , లక్డీకాపూల్ నుంచి వచ్చి ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. వినాయక చవితి పండుగ సందర్బంగా... బుధవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ తమిళ సై దంపతులు... ఖైరతాబాద్ గణేషుడికి తొలి పూజ చేయనున్నారు.
ఇన్నాళ్లు హైట్‌తో తన ప్రత్యేకతను చాటుతూ వస్తున్న ఖైరతాబాద్ గణేషుడు....ఈసారి మట్టితో రూపుదిద్దుకుని పర్యావరణ హితంగా నిలుస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com