Khammam: కుక్క కాటుకు మరో చిన్నారి బలి

Khammam: కుక్క కాటుకు మరో చిన్నారి బలి
వీధిలో తోటి స్నేహితులతో ఆడుకుంటోన్న ఐదేళ్ల చిన్నారి; దాడి చేసిన కుక్క; ఆసుపత్రికి తరలించేలోగానే మృత్యుఒడిలోకి చేరిన చిన్నారి

తెలంగాణాల ో శునకాల దాడులు రోజురోజుకూ హెచ్చుమీరుతున్నాయి. ఖమ్మంల ో ఐదేళ్ల చిన్నారిపై దాడి చేసిన కుక్క తీవ్రంగా గాయపరచింది. చిన్నారిని ఆసుపత్రికి తరలించేలోగానే దెబ్బలకు తాళలేక మరణించాడు. ఖమ్మం పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం బానోత్ భరత్ అనే బాలుడు తోటి స్నేహితులతో కలసి వీధిలో ఆడుకుంటున్నాడు. ఇంతలోనే వారిపైకి దూసుకువచ్చిన కుక్క భరత్ ను తీవ్రంగా గాయపరచింది. వెంటనే తేరుకున్న స్థానికులు కుక్కను తరిమేశారు. భరత్ తల్లిదండ్రులు తీవ్రగాయాలపాలైన కుమారుడిని హుటాహుటిన ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించాల్సిందిగా వైద్యులు సూచించడంతో అటు ప్రయాణమయ్యారు. కానీ, మార్గం మధ్యలోనే సూర్యాపేట వద్ద చిన్నారి ప్రాణాలు విడిచాడని పోలీసులు తెలిపారు. దీంతో చేసేది లేక చిన్నారి అంత్యక్రియలు నిమిత్తం రఘునాథపాలెంలోని పుటానీ తండాకు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story