Khammam : జలాశయాల్లో నీరు తగ్గుతున్న నీటి నిల్వలు

వేసవి కాలం రావడంతో జలాశయాల్లో నీరు తగ్గుముఖం పడుతున్నాయి. దీనికి తోడు భూగర్భ జలాలు కూడా ఇంకిపోతున్నాయి. తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెంగుళూరు వంటి నగరాల్లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలను రోజు చూస్తూనే ఉన్నాం. అయినా ప్రజలు హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. ప్రజలకు తాగునీరు సరఫరా చేసే అధికారులు... సిబ్బంది నిర్లక్ష్యంతో ఎంతో విలువైన నీరు వృధాగా మురుగు కాలువలపాలవుతుంది.
ఖమ్మం జిల్లాలో ప్రధాన నీటి వనరులైన పాలేరు, వైరా రిజర్వాయర్‌లలో నీటి మట్టాలు ఘననీయంగా తగ్గి డెడ్ స్టోరేజీకి చేరాయి. సాగర్ నుంచి ఎడమ కాలువకు తాగునీటి కోసం నీరు వదిలితే తప్పా... రాబోయే రెండు నెలల్లో ఎద్దడి నుంచి తప్పించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా ఆయా పురపాలికల్లో సిబ్బంది నిర్లక్ష్యంతో ఎంతో విలువైన నీరు మురుగు కాలువలపాలవుతుంది.
ఖమ్మం నగరంలో సుమారు 4 లక్షల జనాభాతో పాటు... వైరా, మధిర, సత్తుపల్లి, ఇల్లెందు, కోత్తగూడెం పట్టణాల్లో తాగు నీరు సరఫరా చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఆ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పైపులైన్ల ద్వారా నీటిని ప్రజలకు అందిస్తున్నారు. అయితే ప్రజలకు సరఫరా చేసే ప్రక్రియలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తాగునీరు లీకేజీ రూపంలో వృధాగా పోతున్నాయి. మన్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో... నివాసాలకు చేరాల్సిన నీరు మురుగు కాలువలో కలుస్తున్నాయి.
చాలా ప్రాంతాల్లో మిషన్ భగీరథ పైపులైన్లు వేసినా వాటిని నివాసాలకు అనుసంధానించలేదు. అలాగే వాటికి నల్లాలు బిగించలేదు. నీరు వచ్చినప్పుడు వారి అవసరాల మేరకు పట్టుకొని తరువాత మురుగు కాలువల్లో వేస్తున్నారు. ఒక్క ఖమ్మం నగరంలో లీకేజీల వల్ల కోటి లీటర్ల నీరు వృధాగా పోతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అదే విధంగా వైరా పురపాలికలో అధికారుల నిర్లక్ష్యం కొట్టోచ్చినట్లుగా కనిపిస్తుంది. తాగునీరు సరఫరా చేసే పైపు లైను పగిలి 6నెలలు కావోస్తున్నా... ఇంత వరకు వాటికి మరమ్మతులు చేయించలేదు. నీరు వృధా అవుతున్నా ప్రధాన పైపులైను లీక్ అవుతున్నా ఎవ్వరు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com