Khammam: ఐటీ కొలువొచ్చింది.. వారం రోజుల్లో జాయినింగ్.. కానీ అంతలోనే ఆగిన గుండె

Khammam: ఐటీ కొలువొచ్చింది.. వారం రోజుల్లో జాయినింగ్.. కానీ అంతలోనే ఆగిన గుండె
Khammam: ఆగుతున్న గుండెలు.. ఆకస్మిక మరణాలు.. 30 ఏళ్లు కూడా నిండని యువత గుండెపోటుకు గురవుతున్నారు.

Khammam: ఆగుతున్న గుండెలు.. ఆకస్మిక మరణాలు.. 30 ఏళ్లు కూడా నిండని యువత గుండెపోటుకు గురవుతున్నారు.. క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని కొడుకుని సాప్ట్‌వేర్ ఇంజనీర్ చేశారు.. కొడుక్కి పట్నంలో ఉద్యోగం వచ్చిందని పదిమందికీ చెప్పుకుని ఆనందించేలోపే కన్నుమూశాడు.. కన్నతల్లిదండ్రుల ముందే కొడుకు జీవితం ముగియడం ఆ తల్లిదండ్రుల గుండె చెరువయ్యింది. వారం రోజుల్లో ఉద్యోగంలో జాయినవ్వాలి అంతలోనే గుండెపోటుకు గురై మరణించాడు ఖమ్మంకు చెందిన యువకుడు.

ఖమ్మం జిల్లా మధిర మండలం వక్కలగరుబు గ్రామానికి చెందిన కొట్టే పెద్ద కృష్ణ, రాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు.. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. కొడుకు మురళీ కృష్ణ (26)ను బీటెక్ చదివించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సాప్ట్‌వేర్‌కు సంబంధించిన కోర్సులు చేస్తున్నాడు. ఇటీవల ఓ కంపెనీలో ఐటీ ఉద్యోగం సంపాదించాడు. ఈ నెల 17న జాయినవ్వాల్సి ఉంది.

కొడుక్కి మంచి ఉద్యోగం వచ్చింది తమ కష్టాలన్నీ తీరిపోతాయని భావించారు మురళీ కృష్ణ తల్లిదండ్రులు. కానీ అంతలోనే విధికి కన్నుకుట్టింది. అమ్మానాన్నలకు తనకు ఉద్యోగం వచ్చిన వార్త చెప్పి హైదరాబాద్ చేరుకున్న కృష్ణ స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లాడు. సినిమా చూస్తున్నవాడు చూస్తున్నట్టే ముందుకు ఒరిగిపోయాడు.. గమనించిన స్నేహితులు అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఫలితం దక్కలేదు. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు.

Tags

Read MoreRead Less
Next Story