Manneguda Kidnap Case: మన్నెగూడ యువతి కిడ్నాప్‌.. అచ్చం సినిమా సీన్‌

Manneguda Kidnap Case: మన్నెగూడ యువతి కిడ్నాప్‌.. అచ్చం సినిమా సీన్‌
Manneguda Kidnap Case: హైదరాబాద్‌ మన్నెగూడ కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డి ఎక్కడ? ఇప్పటివరకు నవీన్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదు? ఆరు గంటల్లోనే కిడ్నాప్‌ అయిన యువతిని రక్షించగలిగిన పోలీసులు..

Manneguda Kidnap case: హైదరాబాద్‌ మన్నెగూడ కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డి ఎక్కడ? ఇప్పటివరకు నవీన్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదు? ఆరు గంటల్లోనే కిడ్నాప్‌ అయిన యువతిని రక్షించగలిగిన పోలీసులు.. ఇంకా నవీన్‌రెడ్డిని పట్టుకోలేకపోవడం ఏంటి? సర్వత్రా ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.




నవీన్‌ రెడ్డి కోసం ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ జరుగుతోందని, అతనిని ఇంకా అరెస్ట్ చేయలేదని పోలీసులు చెబుతున్నారు. నవీన్‌ రెడ్డి కోసం పోలీస్‌ బృందాలు తీవ్రంగా వెతుకుతున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. దొరికిన 8 మంది నిందితులను ఇన్వెస్టిగేట్ చేసి మిగతా వాళ్లని పట్టుకుంటామని, త్వరలోనే నవీన్‌రెడ్డిని కూడా అరెస్ట్‌ చేస్తామని చెబుతున్నారు పోలీసులు.



యువతిని సేఫ్‌గా తిరిగి తీసుకొచ్చినప్పటికీ.. ప్రస్తుతం ఆమె మాట్లాడే పరిస్థితిలో లేదంటున్నారు పోలీసులు. అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత భయపెట్టారని, ఆమెను కొట్టడం, భయపెట్టడం వంటివి కూడా జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు.




ఒకేసారి వంద మంది రావడం, ఇంటి మీద పడి విధ్వంసం సృష్టించడం, అడ్డొచ్చిన వారిని కొట్టడం, తనను బలవంతంగా తీసుకెళ్లిపోవడం చూసి.. ఆ యువతి షాక్‌కు గురైందని పోలీసులు చెబుతున్నారు. కిడ్నాప్‌ ఇష్యూను సీరియస్‌గా తీసుకుని, ఏపీ పోలీసుల సహకారంతో కేవలం ఆరు గంటల్లోనే యువతిని రక్షించగలిగామని పోలీసులు తెలిపారు. ఇది పక్కాగా ప్లాన్ చేసిన కిడ్నాప్ అని తేల్చారు పోలీసులు.


మన్నెగూడ యువతి కిడ్నాప్‌ అచ్చం సినిమా సీన్‌ను తలపించింది. 40 నిమిషాల పాటు బీభత్సం సృష్టించిన నవీన్‌రెడ్డి అండ్‌ గ్యాంగ్‌.. అడ్డొచ్చిన వారిని కొట్టి మరీ నిశ్చితార్థం కోసం కూర్చున్న యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. మిస్టర్‌ టీ పేరుతో టీ షాపులు నడుపుతున్న నవీన్‌ రెడ్డి.. యువతి చదివిన కాలేజీలోనే ఫార్మసీ చదివాడు.




ఇద్దరూ ఒకే కాలేజీలో చదవడంతో ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లికి నవీన్‌రెడ్డి కుటుంబ ఒప్పుకున్నప్పటికీ.. యువతి ఫ్యామిలీ అందుకు అంగీకరించలేదు. దాన్ని మనసులో పెట్టుకున్న నవీన్‌ రెడ్డి... యువతి తల్లిదండ్రులపై కోపం పెంచుకున్నాడు. గతంలో యువతితో చనువుగా ఉన్న ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు.




దీనిపై అమ్మాయి తల్లిదండ్రులు ఆధిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నవీన్‌రెడ్డిపై కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో యువతికి మరో సంబంధాన్ని ఖాయం చేశారు తల్లిదండ్రులు. సరిగ్గా నిశ్చితార్థం రోజున.. తన అనుచరులతో యువతి ఇంటిపైకి వెళ్లి నానా బీభత్సం చేసి.. అమ్మాయిని కిడ్నాప్‌ చేశాడు.


నిన్న సాయంత్రం యువతి తన తండిక్రి ఫోన్‌ చేయడంతో.. ఫోన్‌ కాల్‌ ఆధారంగా లోకేషన్‌ ట్రాప్‌ చేసి ఆమెను రక్షించారు పోలీసులు. ఈ ఘటనలో ఎనిమిది మందిని పట్టుకున్నామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు. అయితే.. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో నవీన్‌ రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ, పోలీసులు మాత్రం ఈ విషయాన్ని వెల్లడించలేదు.

Tags

Read MoreRead Less
Next Story