మాజీ హాకీ ప్లేయర్ కుటుంబం కిడ్నాప్.. గంటల్లోనే చేధించిన పోలీసులు!

హైదరాబాద్ బోయినపల్లిలో కిడ్నాప్ కలకలం సృష్టించింది.. బోయిన్‌పల్లిలోని మాజీ హాకీ ప్లేయర్ ప్రవీణ్ రావు కుటుంబాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.ప్రవీణ్‌రావుతోపాటు ఆయన సోదరులు నవీన్, సునీల్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ముగ్గుర్ని కిడ్నాప్ చేసిన దుండగులు..ల్యాప్‌టాప్‌తోపాటు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు.
అయితే, గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. భూ వ్యవహారమే దీనికి కారణంగా అనుమానిస్తున్నారు..
మూడు వాహనాల్లో రాత్రి బోయిన్‌పల్లి వెళ్లిన కిడ్నాపర్లు.. ముగ్గుర్ని కిడ్నాప్ చేశారు.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. కిడ్నాపర్ల వాహనాలను ట్రేస్ చేసి నిందితులను రాంగోపాల్‌పేట పీఎస్ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు.
సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కిడ్నాప్ కేసును ఛేదించారు.. ఈ వ్యవహారంలో భార్గవ్ రామ్ సోదరుడు చంద్రహాస్‌ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com