Kishan Reddy : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా కేసీఆర్ పాలన ఉంది: కిషన్ రెడ్డి

Kishan Reddy : టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే.. బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా కేసీఆర్ పాలన ఉందన్న ఆయన.. తుక్కుగూడ సభలో టీఆర్‌ఎస్ అవినీతి, నియంతృత్వ పాలనపై అమిత్ షా ప్రసంగం ఉంటుందన్నారు. ఇక కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్న ఆమె.. రాష్ట్రంలో పాదయాత్ర చేసిన బీజేపీ నాయకులకు అది తెలుసన్నారు. ఇక రాష్ట్ర విభజన హామీలపై అమిత్ షాను అడిగినా ప్రయోజనం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంకు న్యాయంగా రావాల్సిన నిధులు, సంస్థలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమిత్ షా ను డిమాండ్ చేస్తున్నామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com