తెలంగాణ

హుందాగా రాజకీయాలు చేద్దాం.. బీజేపీకి కేటీఆర్ విజ్ఞప్తి

ఎన్నికలపుడు పోటీపడదామని.. ఎవరి వాదనలు వారు గట్టిగా చెప్పుకుందామన్నారు కేటీఆర్.

హుందాగా రాజకీయాలు చేద్దాం.. బీజేపీకి కేటీఆర్ విజ్ఞప్తి
X

హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. హైదరాబాద్‌ దోమల్‌గూడలో.. GHMC జోనల్‌, డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయాలకు.. మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో.. ఇక్కడ కార్యాయాలు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్‌, మహ్మూద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

ఆ తర్వాత.. బాగ్‌లింగంపల్లిలోని లంబాడి తండాలో డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల ప్రారంభోత్సవంలో కేటీఆర్ సహా కిషన్ రెడ్డి, తలసాని పాల్గొన్నారు. 11 కోట్ల రూపాయలతో నిర్మించిన 126 డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను లబ్దిదారులకు అందజేశారు. 9 అంతస్తుల్లో ఈ ఇళ్లను నిర్మించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇళ్లు నిర్మించామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 18 వేల కోట్ల డుబల్‌ బెడ్ రూమ్‌ ఇళ్లను నిర్మిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఇళ్లు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. 40 నుంచి 50 లక్షల ధర పలికే ఇళ్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. ఎన్నికలపుడే రాజకీయాలు.. ఆతర్వాత అందరూ కలిసి పనిచేయాలన్నారు కేటీఆర్‌. హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి కావొస్తోందన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి కేటీఆర్ ఓ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలపుడు పోటీపడదామని.. ఎవరి వాదనలు వారు గట్టిగా చెప్పుకుందామన్నారు. ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని.. హుందాగా రాజకీయాలు చేద్దామన్నారు.

పేదలకు ఇళ్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనడంలో సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.


Next Story

RELATED STORIES