KISHAN REDDY: రాహుల్ డైరెక్షన్‌లో రేవంత్ యాక్షన్: కిషన్ రెడ్డి

KISHAN REDDY: రాహుల్ డైరెక్షన్‌లో రేవంత్ యాక్షన్: కిషన్ రెడ్డి
X
కిషన్‌రెడ్డి సంచలన విమర్శలు... కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ కేంద్రమంత్రి

సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఏదో ఒక వివాదాన్ని రేవంత్ తెరపైకి తెస్తున్నారు. దేశంలో ఏ సీఎం కూడా వారానికికొకసారి ఢిల్లీ వెళ్లలేదు. కానీ రేవంత్ వారానికోసారి ఢిల్లీ వెళ్లి అటెండెన్స్ వేయించుకుంటున్నారు. రాహుల్ డైరెక్షన్‌లోనే ప్రధానిపై రేవంత్ విమర్శలు చేశారు’. అని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌పైనా కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌కు పదేళ్ల పాలనలో వచ్చిన ప్రజా వ్యతిరేకత కంటే ఎక్కువగా రాష్ట్రంలో ఏడాదికే కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నల్లగొండలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డి గెలుపు కోరుతూ ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలలో బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారని.. వారిని గెలిపించాలని కోరారు.

బీజేపీ గెలుపు ఖాయం

మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన వరంగల్‌లో పర్యటిస్తున్నారు. ‘హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది. సర్కార్‌పై అన్ని వర్గాలు నిరాశతో ఉన్నాయి. రైతులు, ఉద్యోగులు, యువత వ్యతిరేకతతో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. బీజేపీకి అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది. ’ అని కిషన్‌ వ్యాఖ్యానించారు.

మున్నూరు కాపులు కూడా బీసీలు కాదా

మున్నూరు కాపులు కూడా బీసీలు కాదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మోదీపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన కిషన్‌రెడ్డి.. మోదీ కులంపై రేవంత్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 1994లోనే మోదీ కులాన్ని బీసీల్లో కలిపారని, చాలా కులాలు దశలవారీగా బీసీల్లో చేరాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


Tags

Next Story