హైదరాబాద్‌ వరద ముంపు ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన

హైదరాబాద్‌ వరద ముంపు ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన
X

హైదరాబాద్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. అంబర్‌పేట నియోజకవర్గంలోని మల్లికార్జున నగర్‌, బాపూ నగర్‌, ప్రేమ్‌నగర్‌తో పాటు మరిన్ని కాలనీల్లో కిషన్‌ రెడ్డి పర్యటించారు. నగరంలో వరదల కారణంగా మౌలిక వసతులు దెబ్బతిని లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారని.. ‌ ప్రజల కనీస అవసరాలైన నీరు, పాలు కూరగాయలకు ఇబ్బంది ఏర్పడే పరిస్థితులున్నాయని అన్నారు. ఓ వైపు కరోనా సంక్షోభం, మరోవైపు వరదలతో నగరం అతలాకుతలం అవుతోందని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరింత ఫోకస్‌ చేసి.. సహాయక చర్యలు వేగవంతం చేయాలని కిషన్‌ రెడ్డి సూచించారు.

Tags

Next Story