రైతులు శాంతియుతంగా ధర్నా చేస్తే సంకెళ్లు వేస్తారా..!

రైతులకు సంకెళ్లు వేసిన ఘటనపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా రియాక్టయ్యారు.కేసీఆర్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.రీజనల్ రింగ్ రోడ్డు కోసం కొన్ని నెలలుగా భూములు తీసుకుంటున్నారన్నారు.భూసేకరణ పేరుతో బలహీనవర్గాలు, హరిజన దళితుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారని ఆరోపించారు.వారసత్వంగా వస్తున్న కొద్దిపాటి భూమి పోతుందన్న బాధతో భువనగిరి, రాయగిరి, మిగిలిన గ్రామాల రైతులు పోరాటం చేస్తున్నారన్నారు.శాంతియుతంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్న రైతుల్ని అరెస్టు చేయడమే కాక, జైలుకు పంపారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.రైతులను కోర్టుకు తీసుకొచ్చే సమయంలో రాయగిరి రైతులకు బేడీలు వేయడంపై ఆయన తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.ఈ ఘటనను చూసి కళ్లలో నీళ్లు తిరిగాయన్నారు.ఇది మంచి పద్ధతి కాదని, రైతుల కోసం ఎంతో చేస్తున్నానని చెప్పే కేసీఆర్ ఏం సమాధానం చెప్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com