Konda Visweshwar Reddy : అజారుద్దీన్, పేటీఎంకు కాంట్రాక్టు ఇవ్వడంలోనే అవినీతి జరిగింది : బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి

X
By - Sai Gnan |23 Sept 2022 5:00 PM IST
Konda Visweshwar Reddy : మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Konda Visweshwar Reddy : మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ టికెట్ల అమ్మకాల్లో అవినీతి జరిగిందన్నారు. అజారుద్దీన్.. పేటీఎంకు కాంట్రాక్టు ఇవ్వడంలోనే అవినీతి జరిగిందని ఆరోపించారు. 20 నిమిషాల్లోనే 30 వేలకు పైగా టికెట్లు ఎలా అమ్ముడు పోతాయని ప్రశ్నించారు. కేటీఆర్ ఆదేశాలతోనే మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్రికెట్ టికెట్ల విషయంలో ఎంటర్ అయ్యారని తెలిపారు. అందరూ కలిసి టికెట్లను బ్లాక్‌లో అమ్మేశారని కొండా విశ్వేశ్వరరెడ్డి
ఆరోపించారు. టికెట్ల అమ్మకాల్లో ప్రభుత్వానికి ఏం సంబంధమన్న కొండా విశ్వేశ్వరరెడ్డి.. HCA అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని, BCCI ఆదేశాలతోనే HCA టికెట్లు అమ్ముతుందని స్పష్టంచేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com