Kondagattu : కొండగట్టు అంజన్న గుడిలో దొంగతనం

కొండగట్టు పుణ్యక్షేత్రం ఆంజనేయస్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆలయ సిబ్బంది. ఆలయానికి చేరుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. దర్యాప్తు జరుగుతుండటంతో ఆలయాన్ని మూసివేశారు. భక్తులకు అనుమతి ఇవ్వడం లేదు. ఆలయంలో భారీగా నగలు మాయం అయ్యాయని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయంలోని 15కిలోల వెండి, బంగారు నగలు దోచుకెళ్లారు. గురువారం అర్థరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు బేతాళ స్వామి గుడి నుంచి ప్రధాన ఆలయంలోకి చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు కొందరు అనుమానితుల చేతుల్లో కట్టింగ్ ప్లేయర్స్ తో పాటు ఇతర సామాగ్రి ఉన్నట్లు గుర్తించారు. జాగీలాలను రప్పించి సోదాలు నిర్వహిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com