తెలంగాణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి సత్తుపల్లి రైల్వే లైన్‌.. అడ్డుకున్న రైతులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి వరకు నూతనంగా నిర్మిస్తోన్న రైల్వే నిర్మాణ పనులను చండ్రుగొండ మండలం మద్దకూరు రెవెన్యూ గ్రామం అయ్యన్నపాలెంలో రైతులు అడ్డుకున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి సత్తుపల్లి రైల్వే లైన్‌.. అడ్డుకున్న రైతులు
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి వరకు నూతనంగా నిర్మిస్తోన్న రైల్వే నిర్మాణ పనులను చండ్రుగొండ మండలం మద్దకూరు రెవెన్యూ గ్రామం అయ్యన్నపాలెంలో రైతులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి.

విషయం తెలుసుకున్న తహశీల్దార్‌ స్పాట్‌కు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గతంలో కొలతల ప్రకారమే రైల్వే నిర్మాణ పనులు చేపట్టాలని.. అలా కాకుండా తమ వద్ద ఎక్కువ భూమిని తీసుకుంటున్నారని తహశీల్దారుకు రైతులు వివరించారు. రైతుల ఆవేదనను అర్ధం చేసుకున్ప తహశీల్దార్‌ రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రైతలు ఆందోళన విరమించారు.

Next Story

RELATED STORIES