KOUSHIK REDDY: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి క్షమాపణలు

వీణవంకలో జరిగిన సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై భక్తులు, సామాన్య ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అక్కడ రచ్చ చేయడమే రాజకీయం అన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉంటోందనే విమర్శలు ఈ ఘటనతో మరింత బలపడ్డాయి. జాతరలో రద్దీని దృష్టిలో ఉంచుకుని, హైకోర్టు నిబంధనల మేరకు పరిమిత వాహనాలనే అనుమతిస్తామని పోలీసులు చెప్పినప్పటికీ.. ఆయన తన భారీ కాన్వాయ్‌తో వెళ్లేందుకు ప్రయత్నించి ఉద్రిక్తతకు దారితీశారు. జాతర వంటి పవిత్రమైన చోట భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పోలీసులు అడ్డుకుంటే, దానిని రాజకీయం చేస్తూ రోడ్డుపై బైఠాయించి హడావుడి చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి విధి నిర్వహణలో ఉన్న పోలీసులను మతం పేరుతో దూషించడం, ఉన్నత స్థాయి అధికారులను బెదిరించడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా మారిది. జాతర ప్రాంగణంలో కూడా దళిత మహిళా సర్పంచ్‌తో కొబ్బరికాయ కొట్టించాలనే సాకుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధపడతారని క్లారిటీ వచ్చినట్లయింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సంయమనం పాటించాల్సింది పోయి, పోలీసులపై దూకుడు ప్రదర్శించి ఓవరాక్షన్ చేయడం వల్ల సామాన్య భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. ఒక పక్క అమ్మవారి దర్శనం కోసం వేల సంఖ్యలో ప్రజలు వేచి చూస్తుంటే, వారిని ఇబ్బంది పెడుతూ ఇలాంటి ర్యాలీలు , నిరసనలు చేయడం ఏ రకమైన రాజకీయం అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
ఐపీఎస్ అధికారుల సంఘం ఫైర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరీంనగర్ సీపీ గౌస్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇటీవల ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కరీంనగర్ సీపీ గౌస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సీపీ గౌస్ మత మార్పిడులపై పాల్పడుతున్నారని అన్నారు. ఆ వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. కౌషిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారం. కౌశిక్‌పై చర్యలు తీసుకోవాలి’అని స్పష్టం చేసింది.
స్పీకర్‌కు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు
వీణవంక మండలంలో జరిగిన మినీ మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం శాసనసభ స్పీకర్‌కు ఆయన ప్రివిలేజ్ మోషన్అందజేశారు. జాతరలో ప్రజలతో కలి సి ఆదివాసీ దేవతలను దర్శించుకుంటున్న సమయంలో, కరీంనగర్ జిల్లా సీపీ, హుజురాబాద్ ఏసీపీ, జమ్మికుంట రూరల్ సీఐ తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, చట్టాన్ని ఉల్లంఘించి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. అధికార పార్టీ ఒత్తిడితోనే పోలీసు యంత్రాంగం ఒక శాసనసభ్యుడి హక్కులను కాలరాసిందని, ఈ చర్య శాసనసభ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బాధ్యులైన అధికారులపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు.
స్పందించిన కౌశిక్ రెడ్డి
ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి స్పందిస్తూ, అధికార పార్టీ అండతో కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, అప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిన ఈ అధికారులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో, జిల్లాలో కొందరు అధికారులు బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని, వారందరినీ గుర్తు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఐపీఎస్ అధికారుల సంఘానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో కొందరు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
