KTR Birthday: నాణేలతో కేటీఆర్ చిత్రం.. ఘనంగా ఐటీ మంత్రి జన్మదిన వేడుకలు..

KTR Birthday: నాణేలతో కేటీఆర్ చిత్రం.. ఘనంగా ఐటీ మంత్రి జన్మదిన వేడుకలు..
KTR Birthday: తెలంగాణ ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.

KTR Birthday: తెలంగాణ ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు.. అభిమానులు, కార్యకర్తలు మంత్రికి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కాలుకి దెబ్బతగలడంతో ఆయన బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు. కానీ ఆయన అభిమానులు, టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ పుట్టినరోజును వేడుకగా జరుపుతున్నారు. తమ నేతపై ఉన్న అభిమానాన్ని టీఆర్ఎస్ నేతలు వినూత్న రీతుల్లో తెలియజేస్తున్నారు.

తెలంగాణ భవన్‌లో మంత్రి తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్‌ కట్‌ చేశారు మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. అనంతరం కేటీఆర్‌పై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రారంభించారు. ఇసుకతో రూపొందించిన కేటీఆర్‌ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభివాణిదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, ముఠాగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ రవీంద్రభారతిలోని ఘంటసాల ప్రాంగణంలో నాణేలతో 30 అడుగుల కేటీఆర్ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంపై హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అని రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.కేటీఆర్ పై ఉన్న అభిమానంతో కామారెడ్డికి చెందిన అతిమాముల రామకృష్ణ నాణేలతో చిత్రం వేయించారు. హైదరాబాద్ కు చెందిన ప్రఖ్యాత రంగోలీ చిత్రకారుడు విజయ్ భాస్కర్ చేతుల్లో ఈ కళాఖండం రూపుదిద్దుకుంది. కేటీఆర్ చిత్రం ఏర్పాటు చేయడానికి 40 వేల నాణేలను ఉపయోగించారు. దాదాపు 20 గంటలకుపైగా కళాకారులు శ్రమించారు. రవీంద్ర భారతి ఘంటసాల ప్రాంగణంలో వేసిన కేటీఆర్ చిత్రం వద్ద ఫొటోలు దిగేందుకు సందర్శకులు పోటీ

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ శివలింగయ్యతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రంలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి కేటీఆర్ మరెన్నో ఉన్నతమైన పదవులను అధిరోహించాలని ఎమ్మెల్యే వనామా ఆకాంక్షించారు.

కేటీఆర్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అయితే.. కేటీఆర్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అంటూ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కొనియాడారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఓయూ టీఆర్ఎస్‌వి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. అనంతరం ఓయూ హనుమాన్ ఆలయంలో మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ఎమ్మెల్యే గాధరి కిషోర్ ప్రత్యేక పూజలుచేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా 9ఏళ్ల చిన్నారి బ్లెస్సీ సీతాఫలం విత్తన బంతులను ఏర్పాటు చేసింది. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన చిన్నారి బ్లేస్సి.. మంత్రికి వినూత్నంగా విషెష్ చెప్పాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు కుటుంబసభ్యులతో కలిసి కొన్నాళ్లుగా సిద్ధం చేస్తున్న సీతాఫలం విత్తన బంతులతో హ్యాపీ బర్త్ డే కేటీఆర్ సారూ అంటూ సరికొత్తగా శుభాకాంక్షలు తెలిపింది. పచ్చదనం ప్రాధాన్యతను తెలిపే సందేశంతో కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన చిన్నారిని పలువురు అభినందించారు.

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుకలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కాలికి గాయమై జన్మదిన వేడుకులకు దూరంగా ఉన్న మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, టీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ తర్వగా కోలుకోవాలని వరంగల్ జిల్లా చిల్పూరు వేంకటేశ్వస్వామి ఆలయంలో ఎమ్మెల్యే రాజయ్య ప్రత్యేకపూజలు చేశారు. మోకాళ్లపై మెట్లు ఎక్కి స్వామివారి దర్శనం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story