KTR about Sonu Sood: సోనూసూద్ సేవ చేస్తుంటే బెదిరించాలని ప్రయత్నించారు: మంత్రి కేటీఆర్

KTR about Sonu Sood (tv5news.in)
KTR about Sonu Sood: సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తారనే భయంతోనే ఆయనపై ఈడీ, ఐటీతో దాడులు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. కావాలనే సోనూసూద్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి బెదిరింపులకు సోనూసూద్ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. సోనూసూద్ ఒక రియల్ హీరో అని, ఆయన వెంట తామంతా ఉంటామని కేటీఆర్ అన్నారు.
కరోనా విపత్తు సమయంలో ప్రభుత్వమే అన్నీ చేయలేదన్న కేటీఆర్.. సోనూసూద్ సేవ చేస్తుంటే బెదిరించాలని, ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కొవిడ్ వారియర్స్‌కు జరిగిన సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ లాంటి నాయకుడు ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఎక్కువగా ఉండదన్నారు సోనూసూద్. కరోనా వల్ల ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారని, వాళ్లకు సహాయపడడమే ఇకపై మనందరి ముందు ఉన్న సవాల్ అని అన్నారు. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు తాను సహాయ కార్యక్రమాలు చేసినా.. ఒక్క తెలంగాణ నుంచే సమాంతరంగా ప్రతిస్పందించే వ్యవస్థ తనకు తారసపడిందని, అది కేటీఆర్ ఆఫీస్ అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com