KTR: మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విటర్‌పై కేటీఆర్ లేటెస్ట్ ట్వీట్ వైరల్..

KTR (tv5news.in)

KTR (tv5news.in)

KTR: అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే టెక్నాలజీ వరల్డ్‌లో దిగ్గజాలుగా వెలుగుతున్న కంపెనీలు అన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది.

KTR: ఇప్పటివరకు అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే టెక్నాలజీ వరల్డ్‌లో దిగ్గజాలుగా వెలుగుతున్న కంపెనీలు అన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో తెలుసా..? ఆ కంపెనీని శాసించి, ముందుకు నడిపించే సీఈఓ స్థానాల్లో ఇండియన్స్ ఉండడం. ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి వాటికే ఇండియన్స్ సీఈఓలుగా పనిచేశారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి ట్విటర్ కూడా చేరింది.

పరాగ్ అగర్వాల్.. ముంబయ్‌ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి పై చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక మామూలు వ్యక్తి. కట్ చేస్తే.. పదేళ్లలో అతడే ట్విటర్‌కు సీఈఓ. 2011లో తన ఎమ్ఎస్ పూర్తయిన తర్వాత ఒక సాధారణ ఇంజనీర్‌గా ట్విటర్‌లో చేరి తన కెరీర్‌ను ప్రారంభించిన పరాగ్.. ఇప్పుడు ఏకంగా దాని సీఈఓ కుర్చీలో కూర్చున్నాడు.

అమెరికాలో ఇండియా పేరును నిలబెట్టేలా చేసిన భారతీయుల జాబితాలోకి పరాగ్ అగర్వాల్ కూడా చేరడంతో ఇక్కడి వారంతా గర్వపడుతున్నారు. తాజాగా కేటీఆర్ కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబీఎమ్, మాస్టర్ కార్డ్.. ఇప్పుడు ట్విటర్.. వీటన్నింటిలో కామన్‌గా ఉందేంటో తెలుసా.. అన్నింటికి సీఈఓలు ఇండియాలోనే పుట్టి పెరగడం.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతే కాక సీఈఓ అయిన పరాగ్‌కు కంగ్రాట్స్ చెప్పారు. కేటీఆర్ ఈ విషయంపై ఇలా స్పెషల్‌గా ట్వీట్ చేయడంపై ఇది వైరల్‌గా మారింది.


Tags

Read MoreRead Less
Next Story