స్టార్టప్ వ్యవస్థాపకులకు మంత్రి కేటీఆర్ అభినందనలు

స్టార్టప్స్ నెలకొల్పి తెలంగాణ కీర్తిని దశదిశలా చాటుతున్న నలుగురు ప్రతిభావంతులను మంత్రి కేటీఆర్ అభినందించారు.. తొలిప్రయత్నంలోనే అద్భుతాలు సాధించడం గొప్పవిషయమని చెప్పారు.. వరంగల్‌కు చెందిన రాపోలు అరుణ్ కుమార్‌తోపాటు కహానియా వ్యవస్థాపకుడు పల్లవ్ బజ్జూరి, ఎక్స్‌ప్రెస్ ఫౌండర్ శ్రీనివాస్ మాధవం, స్టూమాగ్జ్ వ్యవస్థాపకుడు శ్రీచరణ్ లక్కరాజు ప్రగతిభవన్ వెళ్లి మంత్రి కేటీఆర్‌ను కలిశారు.. అంకుర పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలిపారు.. టీహబ్, వీహబ్, టీవర్క్స్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేసి దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా స్టార్టప్ ఎకో సిస్టంను రాష్ట్రంలో అభివృద్ధి చేశారని అరుణ్ కుమార్ అన్నారు.
త్వరలోనే పూర్తిస్థాయి ఆఫీస్ కోసం నూతన భవనం నిర్మించనున్నట్లు అరుణ్ కుమార్ మంత్రి కేటీఆర్‌కు తెలిపారు.. ఈ సందర్భంగా తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన మోషన్ క్యాప్చుర్ సినిమా తీసి సక్సెస్ సాధించిన అరుణ్‌కుమార్‌ను మంత్రి అభినందించారు. అలాగే అంకుర సంస్థల ప్రస్థానం గురించి పల్లవ్, శ్రీనివాస్, శ్రీచరణ్ మంత్రికి వివరించారు. అనంతరం శ్రీచరణ్ రచించిన డాడ్ అనే పుస్తకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ యువత నూతన ఆలోచనలతో అంకుర పరిశ్రమలు స్థాపించి విజయాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com