KTR: మోదీ చెప్పేవన్నీ గాలి మాటలే - మంత్రి కేటీఆర్

KTR: మోదీ చెప్పేవన్నీ గాలి మాటలేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. వరంగల్ పర్యటనలో భాగంగా ఆయన కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. గ్యాస్ ధరలు పెంచిన మోదీకి దండం పెట్టాలన్నారు. బీజేపీ ప్రభుత్వం కోటి మాటలు చెప్పి 10 పైసలు పనిచేయలేదని విమర్శించారు. 2 కోట్ల ఉద్యగాలని చెప్పి.. నిరుద్యోగులను బీజేపీ మోసం చేసిందన్నారు. వరంగల్ లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. వరుసగా అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించారు.
184.53 కోట్ల రూపాయల విలువైన 20 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 7 కోట్ల రపాయల వ్యయంతో భద్రకాళి గుడి కమాన్ నుంచి GWMC కార్యాలయం వరకు నిర్మించిన R 4 రోడ్డును, 7 కోట్ల రూపాయల వ్యయంతో అలంకార్ దర్గ బ్రిడ్జి నుంచి రోడ్ నంబర్ 2 వరకు నిర్మించిన స్మార్ట్ రోడ్ R 3 ని, 11.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన పబ్లిక్ గార్డెన్స్, కోటిన్నర వ్యయంతో ఆధునీకరించిన ప్రాంతీయ గ్రంథాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com