BRS: కాళ్లు పట్టుకున్నా మళ్లీ రానివ్వం

BRS: కాళ్లు పట్టుకున్నా మళ్లీ రానివ్వం
బీఆర్‌ఎస్‌ నేతల మండిపాటు... నమ్మించి మోసం చేశారన్న కేటీఆర్‌

బీఆర్‌ఎస్ కష్ట కాలంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్తున్న వారికి కాలమే గుణపాఠం చెప్తుందని ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు KTR అన్నారు. మంత్రిగా చేస్తే పట్నం మహేందర్ రెడ్డి అందరికీ సహకరిస్తారని అనుకుంటే సునీత మహేందర్ రెడ్డి వెన్నుపోటు పొడిచి పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారని కేటీఆర్ విమర్శించారు.మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి మళ్లీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని KTR స్పష్టం చేశారు. KCR కూతురు అరెస్ట్ అవుతుంటే నవ్వుకుంటూ పార్టీ మారిన వారికి గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం సహా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు, భాష రోత పుట్టించేలా ఉన్నాయన్న కేటీఆర్ ఆరు గ్యారంటీలు పోయి.. ఆరు గారడీలు వచ్చాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ అని లీకులు ఇస్తున్నారనిదమ్ముంటే విచారణ చేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు.

హరీశ్‌ది అదే మాట

కొంత మంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని వీడుతున్నారని,వాళ్లు మళ్లీ కాళ్లు పట్టుకున్నా పార్టీలో చేర్చుకోబోమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి పార్టీ నుంచి పోయే వాళ్లకు ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. ఇది ఆకులు రాలే కాలమని. కొత్త చిగురు మళ్ళీ భారాసలో పుట్టుకొస్తుందని హరీశ్ వ్యాఖ్యానించారు. నాయకులను మాత్రమే కాంగ్రెస్ కొనగలదని, ఉద్యమకారులను కొనలేదని స్పష్టంచేశారు.


శూన్యం నుంచి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణను సాధించిన ధీశాలి KCR అని, అలాంటి ధీరుడిని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయలేరని బీఆర్‌ఎస్‌ నేతలు అన్నారు. ఎన్నో అవమానాలు ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలను ఛేదించిన ధీరత్వం KCRదని గుర్తు చేశారు. కడియం శ్రీహరి సహా పలువురు నేతలు పార్టీ వీడుతుండటంపై బీఆర్‌ఎస్‌ వరంగల్ నేతలు మండిపడ్డారు. ప్యాకేజీలు మాట్లాడుకుని కడియం అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడియం వెంటనే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని..డిమాండ్ చేశారు. పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన కడియం కష్టకాలంలో పార్టీకి అండగా ఉండకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అభ్యర్థిత్వం ప్రకటించాక..పార్టీ మారిన చరిత్ర కడియం కుటుంబానికే దక్కుతుందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story