KTR: ముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. దాదాపు రూ.4200 కోట్ల పెట్టుబడులతో తిరుగు ప్రయాణం..

KTR: మంత్రి కేటీఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటనలో 45 కంపెనీల ప్రతినిధి బృందాలతో KTR సమావేశమయ్యారు. సుమారు 4వేల 200 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయి. పలు కంపెనీలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ టూర్‌లో ZF కంపెనీ తెలంగాణలో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. జూన్ 1న నానక్ రామ్‌గూడలో తన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.
మూడు వేల మంది సిబ్బందితో అతిపెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామంది. ఈనెల 18న లండన్‌కు వెళ్లిన KTR... యూకేతో పాటు స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రపంచంలోని అనేక ప్రముఖ కంపెనీల ప్రతినిధి బృందాలతో భేటీ అయ్యారు. తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రభుత్వ విధానాలను వారికి వివరించారు. దావోస్ టూర్‌పై కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ వేదిక పైన తెలంగాణ ప్రభుత్వ విధానాలతో పాటు, పెట్టుబడి అవకాశాలను చాటడంలో పర్యటన ఎంతగానో దోహదపడిందని అన్నారు.
ఈసారి భారతదేశం నుంచి దావోస్‌లో పాల్గొన్న పలు రాష్ట్రాల పెవిలియన్‌లతో పోల్చినపుడు తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత దేశానికి చెందిన అనేక కంపెనీల ప్రతినిధులతో పాటు పలు అంతర్జాతీయ మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులు తెలంగాణ పెవిలియన్‌ను ప్రశంసించారు. ఆయా చర్చల్లో మంత్రి కేటీఆర్ తన ప్రసంగాల్లో వెలిబుచ్చిన అభిప్రాయాలకు ప్రశంసలు దక్కాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com