KTR: ఎంతమంది రైతుల ఉసురు తీసుకుంటారు

KTR:  ఎంతమంది రైతుల ఉసురు తీసుకుంటారు
X
రేవంత్ సర్కార్‌పై కేటీఆర్‌ మండిపాటు... తెలంగాణలో రైతు పరిస్థితి బాలేదని ఆవేదన

కాంగ్రెస్ వచ్చి.. మార్పు తెచ్చిందంటే ఏమో అనుకున్నామని కానీ రైతుల చేతుల్లోకి పురుగుల మందు డబ్బా తెచ్చి పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ విమర్శించారు. రైతు బంధు రాలేదు.. రుణమాఫీ కాలేదు.. తెలంగాణలో బక్కచిక్కిన రైతు పరిస్థితి ఏమాత్రం బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికంతటికీ కారణం అబద్దాలతో అధికారం చేపట్టిన రేవంత్ సర్కార్ కాదా?’’ అంటూ నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం.. రైతు మహేందర్‌రెడ్డి పాలిట శాపమైందని కేటీఆర్‌ మండిపడ్డారు. సంపూర్ణంగా రైతు రుణమాఫీ చేస్తామని దేవుడిపై ఒట్లు వేసినా..రైతులకు తప్పని పాట్లు!! అంటూ ట్వీట్‌ చేశారు. ‘‘ఎంతమంది రైతుల ఉసురు తీసుకుంటారని ప్రశ్నించారు. ఇంకెంతమంది రైతుల చేతుల్లో పురుగుల మంది డబ్బా పెడతారని కేటీఆర్‌ నిలదీశారు. రైతులకు అభయం ఇచ్చేందుకు వెళ్తే అరెస్టులు చేసేందుకు మంత్రుల ఆదేశాలు.. ఇదేనా ప్రజా ప్రభుత్వమని ప్రశ్నించారు. ఏమైంది మీ రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు అంటూ కేటీఆర్‌ ట్వీట్ చేశారు.


తెల్లబంగారం తెల్లబోతోంది..

తెలంగాణలో తెల్ల బంగారం తెల్లబోతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. పత్తి కొనుగోళ్ల తీరుపై ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. బోనస్‌ దేవుడెరుగు.. మద్దతు ధరకే దిక్కు లేదని ఎద్దేవా చేశారు. దళారుల చేతిలో పత్తి రైతులు చిత్తవుతున్నారని పేర్కొన్నారు. కొర్రీలతో సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపేసిందని చెప్పారు. రైతు ఆగమవుతుంటే ప్రభుత్వం పత్తా లేదన్నారు. పత్తి కొనుగోళ్ల అంశంలో ప్రభుత్వ చొరవ లేదని వ్యాఖ్యానించారు. రైతు డిక్లరేషన్‌ బోగస్‌.. కర్షక ద్రోహి కాంగ్రెస్‌ అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్‌ది డైవర్షన్ పాలిటిక్స్‌

రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిస్ట్రక్షన్, డైవర్షన్‌తోనే కాలం గడిపేస్తోందని ప్రజాసమస్యలను పరిష్కారం చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమయిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎఆస్పత్రుల్లో మందులు కూడా ఉండటం లేదని పేద ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వానికి ప్రజుల బుద్ధి చెబుతారన్నారు.

Tags

Next Story