KTR : మోదీ అహంకారానికి మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోటీ జరుగుతోంది : కేటీఆర్
![KTR : మోదీ అహంకారానికి మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోటీ జరుగుతోంది : కేటీఆర్ KTR : మోదీ అహంకారానికి మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోటీ జరుగుతోంది : కేటీఆర్](https://www.tv5news.in/h-upload/2022/10/11/812381-ktr-fire-on-narendra-modi.webp)
KTR : ఒక కాంట్రాక్టర్ బలుపుతో మునుగోడు బైపోల్ వచ్చిందని.. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి KTR అన్నారు. తెలంగాణ భవన్‌లో TRSV విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. మోదీ అహంకారానికి మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోటీ జరుగుతోందని అన్నారు.
ఇక మునుగోడులో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డికి 18 వేల కోట్ల కాంట్రాక్టును మోదీ సర్కారు ఇచ్చిందన్న కేటీఆర్.. అదే మొత్తం మునుగోడు అభివృద్ధికి ఇస్తే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటామన్నారు.
కేసీఆర్ మునుగోడుకు ఏమి చేశాడు అన్న వారికి సమాధానం చెప్పాలన్న కేటీఆర్.. కేసీఆర్ వచ్చాకే ఫోరైడ్ సమస్య పోయిందన్నారు. మిషన్ భగీరథతో ప్రజల కష్టాలు తీరాయని పేర్కొన్నారు. మూడేళ్లలో సమస్యలు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పామని.. అదే చేసి చూపించామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క గ్రామంలో కూడా ఫ్లోరోసిన్ సమస్య లేదని అన్నారు. 40వేల మందికి ఆసరా ఫించన్లుఇస్తున్నామన్నారు. స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
మరోవైపు ప్రధాని మోదీ, బండి సంజయ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై.. కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ విషయంలో మోదీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని KTR మండిపడ్డారు. అయితే జుమ్లా, లేకపోతే హమ్లా ఇదే మోదీ స్టైల్ అని విమర్శించారు. మోదీ, బోడి, ఈడీ మా వెంట్రుక కూడా పీకలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చావనైనా చస్తాం కానీ .. బీజేపీకి లొంగే ప్రసక్తే లేదన్నారు. ఇక కోమటిరెడ్డిలు.. కోవర్డు రెడ్డలు అంటూ కేటీఆర్ విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com