KTR: కేంద్రం వైఫల్యాలను ప్రశ్నిస్తే దేశ ద్రోహి అంటూ ముద్ర వేస్తున్నారు - కేటీఆర్

X
KTR (tv5news.in)
KTR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ధరలు పెరిగితే.. ట్వీట్లు పెట్టి, రోడ్లెక్కిన మోదీ.. ఇప్పుడెందుకు ఇంత దారుణంగా ధరలు పెంచుతున్నారని… మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సిరిసిల్లలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగారు. ముడి చమురు ధర పెరగకున్నా.. పెట్రోల్, డీజిల్ ధర మాత్రం పెరిగిందని విమర్శించారు. 8 ఏళ్ల క్రితం 410 రూపాయలున్న సిలిండర్.. ఇప్పుడు వెయ్యి రూపాయలకు పెరిగిందన్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తే దేశ ద్రోహివి అంటూ నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
