KTR: కాంగ్రెస్‌ కావాలా..? కరెంట్‌ కావాలా.. ? తెలంగాణ రైతులే తేల్చుకోవాలన్న KTR...

KTR: కాంగ్రెస్‌ కావాలా..? కరెంట్‌ కావాలా..	?  తెలంగాణ రైతులే తేల్చుకోవాలన్న KTR...
కాంగ్రెస్‌ వస్తే క్రాప్‌ హాలీ డేలే అని హెచ్చరిక

కాంగ్రెస్ కావాలో? కరెంట్ కావాలో? తెలంగాణ రైతులు తేల్చుకోవాలని బీఆర్‌ఎస్‌ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ వ్యవసాయానికి క్రాఫ్ హాలీడేలు, పరిశ్రమలకు పవర్ హాలీడేలు వస్తాయన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ టెలివిజన్ ఛానెల్ లో మాట్లాడుతూ మరోసారి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. అదెలా సాధ్యమో రైతులు ఆలోచించాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ లో నిరంతరం తాగునీటిని అందించాలన్నదే భారత రాష్ట్ర సమితి లక్ష్యమని KTR అన్నారు. హైదరాబాద్ లో జరిగిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు. కాలుష్య రహిత రవాణకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు. KTR చెప్పారు. రాబోయే 10 ఏళ్లలో 415 కిలోమీటర్లమేర మెట్రోను విస్తరించాలన్నదే తమ ఎజెండా అని వెల్లడించారు.

ఇప్పుడే తెలంగాణ రైతులు బాగుపడుతున్నారని, కాంగ్రెస్‌ తీరుతో రైతులు తిగిరి ఆగమవుతారని కేటీఆర్‌ తెలిపారు. రైతులపై కాంగ్రెస్‌కు ఎందుకు ఇంత కక్ష అని ప్రశ్నించిన KTR... 70 లక్షల మంది రైతులను బిచ్చగాళ్లని రేవంత్‌రెడ్డి అన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో బావి దగ్గర నిద్రపోయిన రోజులను రైతులు మరోసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. 24 గంటలు కరెంట్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆ విషయాన్ని రైతులు మర్చిపోవద్దని KTR అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం బెదిరిస్తోందని.... మీటర్లు పెట్టకుండా కేంద్రం నుంచి వచ్చే రూ.30 వేల కోట్లు వదులుకున్నామని గుర్తు చేశారు. రాబందుల కాలం పోయిందని... రైతుబంధు రాజ్యం వచ్చిందన్నారు.

మరోవైపు హరీశ్‌రావు కూడా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కర్ణాటక కాంగ్రెస్ నేతల అడుగులకు మడుగులొత్తుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ హక్కులు కాపాడగలరా అని హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ KCRతో తప్ప ఇంకెవరితో సాధ్యం కాదన్నారు. KL యూనివర్సిటీ బోరంపేట క్యాంపస్ లో ఆపిల్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని హరీశ్ రావు ప్రారంభించారు. గత ఐదేళ్లలో ఆరు లక్షల Itఉద్యోగాలు కల్పించామని ఆయన పారిశ్రామిక రంగంలో మరో 24 లక్షల మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తెచ్చామని, మరిన్ని పథకాలు తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని హరీశ్ వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story