స్వచ్ఛ తెలంగాణను తయారు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : కేటీఆర్

హైదరాబాద్ జీడిమెట్లలో భారీ రీసైక్లింగ్ ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ప్లాంట్‌ను పరిశీలించారు. 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ రీసైక్లింగ్ ప్లాంట్‌ను నిర్మించారు. దక్షిణాదిలోనే పెద్దదికాగా.. దేశంలోనే రెండో అతిపెద్ద ప్లాంట్ ఇదే. రోజుకు 5 వందల టన్నుల శిథిల వ్యర్థాల ఈ ప్లాంట్‌లో రీసైక్లింగ్ చేయనున్నారు. ఇది అందుబాటులోకి రావడంతో హైదరాబాద్‌లో నిర్మాణ వ్యర్థాల సమస్యకు పరిష్కారం దొరికినట్లైంది. త్వరలో ఫతుల్లాగూడ, కొత్వాల్‌గూడ, జవహర్‌నగర్‌లో ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. నిర్మాణ వ్యర్థాలతో ఇటుకలు, ఫుట్‌పాత్ టైల్స్ తయారీ చేయనున్నారు.
వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం మంచి పరిణామం అన్నారు మంత్రి కేటీఆర్. ఈ విషయంలో హైదరాబాద్ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు ఈ ప్లాంట్లు దోహదం చేస్తాయన్న కేటీఆర్.. స్వచ్ఛ తెలంగాణను తయారు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com