KTR: 2072 వరకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ప్లాన్: కేటీఆర్

KTR: హైదరాబాద్ నగరానికి.. 2072 వరకు తాగునీటికి ఇబ్బందులు ల్లేకుండా ముందు చూపుతో ప్రణాళికలు రూపొందించామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం.. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇన్‌టెక్ వెల్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో.. మంత్రులు మహమూద్ అలి, సబిత, తలసాని, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లు పాల్గొన్నారు.
వరుసగా ఏడేళ్లు కరువు వచ్చినా తాగునీటికి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపులా, బయట ఉన్న ప్రాంతాలకు తాగు నీటిని అందించేలా ప్లాన్ వేశామన్నారు. ఇక దేశంలో శరవేగంగా హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. 15ఏళ్ల తర్వాత దేశంలో ఢిల్లీ తర్వాత అతి పెద్ద నగరంగా హైదరాబాద్ ఉంటుందన్న ఆయన.. దేశానికే జాతి సంపద భాగ్యనగరమని ఆయన పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com