VRA : వీఆర్ఏలకు శుభవార్త..

VRA : VRAల మెరుపు ఆందోళనలతో తెలంగాణ సర్కార్ ఎట్టకేలకు దిగొచ్చింది. చర్చలకు సిద్ధమంటూ మంత్రి కేటీఆర్‌తో ఆహ్వానం పంపింది. ఈమేరకు పదిమంది VRAలను చర్చలకు ఆహ్వానించారు కేటీఆర్. దీంతో కేటీఆర్ ఆఫీసుకు బయల్దేరారు VRA ప్రతినిధులు.
సమస్యలు పరిష్కరించాలంటూ 51రోజులుగా శాంతియుత ఆందోళనలు చేసిన VRAలు... సర్కారు నుంచి కనీస స్పందన లేకపోవడంతో మెరుపు ధర్నాకు దిగారు. క్షణాల్లోనే వేలాది మంది ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారు. ఇక VRAల మెరుపు ధర్నాతో పోలీసులు షాక్ తిన్నారు. అసెంబ్లీవైపు ఉప్పెనలా దూసుకొస్తున్న VRAలపై విచక్షణా రహితంగా లాఠీ ఛార్జ్ చేశారు. ఎక్కడివారిని అక్కడ అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మొత్తానికి VRAల మెరుపు ఆందోళన తెలంగాణ సర్కారును దిగొచ్చేలా చేసింది. చర్చలకు సిద్ధమంటూ ప్రభుత్వం ఆహ్వానం పంపింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

