ktr: డీ లిమిటేషన్పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి నష్టం జరగొద్దని భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జైపూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్... నియోజకవర్గాల పునర్విభజనపై మాట్లాడారు. జనాభా నియంత్రణను అద్భుతంగా పాటించినటీడీపీ దక్షిణాదికి నష్టం జరగకూడదన్న కేటీఆర్ న్నారు. ‘‘ బిహార్లో ఓటర్ల జాబితా సవరణపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసం విద్వేషాలు సృష్టించడం చాలా సులభం. ప్రజలు రోడ్ల మీద ధర్నాలు చేయనంత మాత్రాన అంతా బాగుందని అనుకోవద్దు. ప్రజలు రాజకీయ పార్టీలు, వ్యవస్థ మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు’’ అని చెప్పారు. హిందీ భాష గురించి మాట్లాడుతూ.. భాష అనేది మాట్లాడానికే కాదని, సంస్కృతికి ఒక గుర్తింపు లాంటిదన్నారు. భారత్లో 22 అధికార భాషలు, 300 అనాధికార భాషలు ఉన్నాయని చెప్పారు. తాము ఎవరిపైనా తెలుగు భాషను రుద్దనప్పుడు.. వాళ్లు ఎందుకు హిందీని ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. త్రి భాషా విధానాన్ని బలవంతంగా రుద్దడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపైనా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎవరికి నష్టం.. ఎవరికి కష్టం..?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు.. తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమమైంది. దేశంలో జన గణన చేపట్టడానికి అనుమతిస్తూ కేంద్రం గెజిట్ నోటీఫికేషన్ జారీ చేసింది. జన గణన వచ్చే ఏడాది పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా లోక్సభ స్థానాలు.. శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది. రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ల తర్వాత రెండు రాష్ట్రాల శాసన సభల్లో స్థానాల పెంపునకు లైన్ క్లియర్ కావడం గమనార్హం.
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మూడు పార్టీల కూటమికి సీట్ల పెంపు కలిసొచ్చే అంశంగా అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కూటమి కలిసే ఉంటుందని.. సీట్లు గతంలో త్యాగం చేసిన వారికి ఈ సారి సీట్లు కేటాయింపుకు అవకాశం వస్తుందని చెబుతున్నారు. అదే విధంగా ప్రతిపక్ష వైసీపీ నేత లు సైతం సామాజికంగా బీసీ, ఎస్సీ వర్గాల సంఖ్య పెరగటం ఖాయమని.. ఆ దామాషా ప్రకారం సీట్ల కేటాయించాల్సిన అంశం తమకు కలిసి వచ్చేదిగా చెబుతున్నారు. అయితే.. నియోజకవర్గా ల పునర్విభజన లో సామాజిక సమీకరణాలు.. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు.. గెలుపు అవకాశా లను ప్రభావితం చేయనున్నాయి. 2009 లో చోటు చేసుకున్న పునర్విభజన ప్రక్రియ.. అదే ఏడాది జరిగిన ఎన్నికల గురించి ప్రస్తుతం పార్టీలు గుర్తు చేసుకుంటున్నాయి. దీంతో.. రాజకీయం గా ఈ నియోజకవర్గాల పునర్విభజన.. సీట్ల పెంపు ఏపీ పార్టీల భవిష్యత్ కు కీలకం కానుంది. పునర్విభజన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిర్వహిస్తుంది. జనగణన ఫలితాలు అందిన తర్వాత, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటవుతుంది. ఈ కమిషన్ జనాభా, భౌగోళిక అంశాలు, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com