KTR: కవితకు కేటీఆర్ వార్నింగ్‌..!

KTR: కవితకు కేటీఆర్ వార్నింగ్‌..!
X
కొన్ని విషయాలు అంతర్గతంగా చర్చిస్తేనే బాగుంటదని కేటీఆర్ వ్యాఖ్యలు

తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి, తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ పార్టీ అని ప్రస్తుతం వాటిని ఎలా వదిలించుకోవాలన్న దానిపై తమ పార్టీ ఫోకస్ చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తన సోదరి, ఎమ్మెల్సీ కవిత తమ తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించారు. ప్రతి పార్టీలోనూ అధ్యక్షుడికి నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలనుకుంటారని తెలిపారు. బీఆర్ఎస్‌లో అందరికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉన్నాయని అర్థం చేసుకోవాలన్నారు. తమ పార్టీలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కోవర్టులు ఉండొచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.కానీ ఒక్క లేఖతో ఏదో పెద్ద జరిగిపోయిందని హడావుడి చేయాల్సిన అవసరం లేదు అన్నారు. పార్టీలో డెమోక్రసీ ఉందని ఎవరైనా లేఖ రాయొచ్చన్నారు.

అంతర్గతంగానే చర్చిస్తే బెటర్

ఏ హోదాలో ఉన్నా అంతర్గతంగా మాట్లాడాల్సిన కొన్ని విషయాలు అంతర్గతంగా చర్చిస్తేనే బాగుంటదని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుడితో కలిసి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. పార్టీలో అందరం కార్యకర్తలమే. అందరికీ ఇదే సూత్రం వర్తిస్తుందని తేల్చి చెప్పారు. అభిప్రాయాలు తెలిపే హక్కు, స్వేచ్ఛ ఉందన్నారు. కానీ లేఖ రాయడానికి గల కారణాలు.. ఆమె పార్టీలో నిజంగానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే విషయాలపై కేటీఆర్ నోరు విప్పలేదు. బీఆర్ఎస్ పార్టీది ఓపెన్ కల్చర్, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగిస్తామని అన్నారు. మరోవైపు తాను రాసిన లేఖపై కేసీఆర్‌ స్పందిస్తారని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story