Solar Roof Cycle Track : సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌కు కేటీఆర్ శంకుస్థాపన..

Solar Roof Cycle Track : పర్యావరణహిత ట్రాన్స్‌పోర్ట్ ఎంకరేజ్ చేసేలా చర్యలు చేపట్టామన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ORR సమీపంలో నానక్‌రామ్ గూడ దగ్గర సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌కు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.
ట్విట్టర్‌లో ఓ మిత్రుడు షేర్ చేసిన పోస్ట్ ద్వారా సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. వచ్చే సమ్మర్ కంటే ముందే నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ట్రాక్ వెంబడి సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇక సెకండ్ ఫేజ్‌లో గండిపేట చుట్టూ సైకిల్ ట్రాక్‌కు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు
మొదటి దశలో మొత్తం 23 కిలోమీటర్ల మేర 4.5 మీటర్ల వెడల్పుతో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్మించనున్నారు. సోలార్ రూఫ్ టాప్ ద్వారా 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాన్ చేశారు. ఈ సైకిల్ ట్రాక్‌ను 2023 వేసవి నాటికి అందుబాటులోకి తెచ్చేలా HMDA టార్గెట్ పెట్టుకుంది. నానక్ రామ్ గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 14 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ నిర్మాణం చేయనున్నారు.
Had promised that we will develop a world-class, solar-roofed cycling track in Hyderabad. Laying the foundation tomorrow for an initial 21 KM
— KTR (@KTRTRS) September 5, 2022
Plan to deliver it before summer 2023 👍 pic.twitter.com/YTUzvfb4XX
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com