KTR: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణలో స్వైరవిహారం చేస్తూ.. అందినకాడికి దోచుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లో సంచనలనం రేపుతున్న హైడ్రాపై కూడా కేటీఆర్ ఫైర్ అయ్యారు. హైడ్రా పేరుతో పేదవాళ్ల బతుకులను రోడ్డుపై వేస్తున్నారని.. గరీబోళ్లకు ఒక న్యాయం.. సీఎం అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయమా..? అని నిలదీశారు. దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణలో భవన్‌లో శేరిలింగంపల్లి పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే తప్పకుండా శేర్లింగంపల్లి నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుందని జోస్యం చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు అతి తెలివితో మాట్లాడుతున్నాడని.. శేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మీవోడే అంటున్నాడని.. గాంధీకి కండవా కప్పిన సన్యాసి ఎవరు మరి శ్రీధర్ బాబు అని అడిగారు. తమ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న సన్యాసి ఎవరో చెప్పాలన్నారు. అక్కలని నమ్ముకుంటే తన బతుకు జూబ్లీ బస్టాండ్ అవుతుందని నిండు అసెంబ్లీలో అక్కలని అవమానించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. " అనగనగా.. ఓ చిట్టి నాయుడు.. ఆ చిట్టి నాయుడు గారికి ఏడుగురు అన్నదమ్ముళ్లు.. తలా ఓ దిక్కు పంచుకున్నరు. రాష్ట్రంలో చిట్టి నాయుడు ఏడుగురు అన్నదమ్ముల రాజ్యం నడుస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యేనే చెప్పిండు" అని కేటీఆర్ సెటైర్స్ వేశారు.
హైదరాబాదీలపై రేవంత్ కు పగ
హైదరాబాద్ నగరం వాళ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని సీఎం రేవంత్ రెడ్డి పగ పెంచుకున్నాడు. అందుకే హైడ్రా పేరుతో పెదోళ్ల ఇండ్లు కూల్చుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు బఫర్ జోన్‌లో ఉంది. ఆయన ఇల్లు ఎందుకు కూల్చరు..? తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదోళ్లకు ఒక న్యాయమా..? మదాపూర్ కావూరి హిల్స్‌లో తిరుపతి రెడ్డి ఇల్లు ఉంటుంది. మాదాపూర్ కావూరి హిల్స్ సెటిల్‌మెంట్లకు అడ్డా. FTL, బఫర్ జోన్‌లో ఇండ్లకుపర్మిషన్ ఇచ్చిన వారినీ జైళ్లో పెట్టు రేవంత్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు ఎందుకు కూలగొట్టరని ప్రశ్నించారు.
చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు
ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వారంలోనే ఏపీలో వృద్దులకు పెన్షన్ పెంచారని అన్నారు. కానీ.. పెన్షన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని అన్నారు. తెలంగాణలో చిట్టినాయిడు సోదురుల కంపెనీ నడుస్తుందన్నారు. రైతు బంధు, భరోసా కాదు.. సీఎం కుర్చీకే భరోసా లేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com