పార్టీ అభ్యర్థులతో భేటీ కానున్న కేటీఆర్.. ఎన్నికల ప్రచార వ్యూహంపై దిశానిర్దేశం

గ్రేటర్ ఎన్నికలకు టీఆర్‌ఎస్ దూకుడు మరింత పెంచింది. శుక్రవారం పార్టీ అభ్యర్థులతో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. మొత్తం 150 అభ్యర్థులతోనూ కేటీఆర్ భేటీ అవుతారు. ఎన్నికల ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు పలు సూచనలు, సలహాలు చేయనున్నారు. స్థానిక నేతలు, ఇన్‌ఛార్జులు, కార్యకర్తలతో ఏవిధంగా సమన్వయంతో ప్రచారానికి వెళ్లడంపై దిశానిర్దేశం చేయనున్నారు. పలు ఉద్యోగ సంఘాల మద్దతు కూడగట్టడంపై కూడా సూచనలు చేయనున్నారు.
ఇక శనివారం కుత్బుల్లాపూర్‌లో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుండటంతో... ప్రచారం బరిలోకి దిగనున్నారు. కూకట్‌పల్లిలోనూ కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com